బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తింటున్నారా, ఊహించని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి
పనీర్ లో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనీర్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. రాత్రి సమయంలో పడుకొని ఉదయం లేచినప్పుడు దాదాపుగా 7 గంటల సమయం కడుపు ఖాళీగా ఉంటుంది. అందువల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాలలో పనీర్ ఒకటి. దీనిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో పనీర్ తీసుకుంటే నెమ్మదిగా జీర్ణం అవ్వటమే కాకుండా కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. ప్రోటీతో పాటు, పనీ లో కొవ్వు, ఐరన్, కాల్షియం మరియు మెగ్నీషియం , విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం, సోడియం, పాటాషియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ‘ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఉదయం సమయంలో తీసుకోవటం వలన రోజంతా హుషారుగా ఉంటారు.
దంతాలు బలంగా మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి మన శరీరానికి కాల్షియం అవసరం. పనీర్ లో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు మరియు దంతాలకు మేలు చేస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళిక ఉన్న వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది..
డయాబెటిస్తో బాధపడేవారికి పనీర్ మంచిది. ఇందులో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది, ఇది పిల్లల మానసిక అభివృద్ధికి మంచిది. పనీర్ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే కో నియంత్రిస్తుంది. కాబట్టి ఇది గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.. అయితే లిమిట్ లో తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. గమనిక:మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.