మీలో మెగ్నీషియం ఉందా? 11.03.2022
ఎక్కువ మంది పనుల హడావుడిలో ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకోవడమే తప్ప ఆహారం మీద ధ్యాస పెట్టడం లేదు. కానీ మనకు మెగ్నీషియం అవసరం చాలా ఎక్కువ. ఇంతకీ ఏయే పదార్తాలలో మెగ్నీషియం ఉంటుందో, అది చేసే మేలేంటో తెలుసుకుందాం..
గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదంపప్పు, జీడిపప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, బీన్స్, సోయా, అవకాడో పండ్లు, పప్పు దినుసులు, కాయధాన్యాలు, అరటిపండు, సోయాపాలు, కొన్ని రకాల చేపల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
శరీర పనితీరులో ఈ ధాతువుదే ప్రధాన పాత్ర, మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అమైనో యాసిడ్స్ నుంచి ప్రొటీన్లను రూపొందిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊబకాయం రాకుండా చేస్తాయి.
కండరాలు సేదతీరడంలో ఉపయోగపడుతుంది. రక్తపోటును, టైప్-2 మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధిని నివారిస్తుంది. పార్శ్వనొప్పిని తగ్గిస్తుంది. డిప్రెషన్‌తో పోరాడుతుంది.
గర్భం దాల్చిన సమయంలో గర్భిణులు మెగ్నీషియం కొరత లేకుండా చూసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు తప్పవు. గర్భిణులు రోజుకు 350 మిల్లీ గ్రాములు అందేలా చూసుకోవాలి. మెగ్నీషియంను విటమిన్ బి-6 తో కలిపి తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలను నివారించవచ్చు.