మెంతులు, మావన శరీరంలోని విషాలను బయటకు పంపించి, మానవ శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. వేల సంవత్సరాలుగా, వాడుకలో ఉన్న ఆయుర్వేదం మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది. వంటింట్లో కంపల్సరీగా ఉండే దినుసుల్లో మెంతులు కూడాఉంటాయి కడీ పకోరా లాంటి వంటలకీ, రోటి పచ్చళ్ళకీ మెంతులు చక్కని రుచినిస్తాయి. అయితే, రుచి మాత్రమే కాదు, మెంతులతో ఎన్నో ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలూ ఉన్నాయంటున్నారు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి బాడీలో ఉండే టాక్సిన్స్ ని బయటకి పంపేస్తాయి. కొలెస్టాల్ తగ్గించడానికి మెంతులు హెల్ప్ చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అదే, సమయంలో మంచి కొలెస్టాల్ మీద ఎలాంటి ప్రభావం చూపించవు. డయాబెటీస్ ఉన్నవారు మెంతుల్ని వారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఇన్సులిస్ ప్రొడక్షన్ లో
సహాయపడతాయి.

బరువు తగ్గడానికి : బరువు ఎక్కువా తక్కువా లేకుండా సమతూకంగా ఉంటే చూసేవాళ్ళకే కాదు, మనకి కూడా బాగుంటుంది. మీరు కొద్దిగా బరువు ఎక్కువగా ఉండి దాన్ని తగ్గించుకోవాలనుకుంటుంటే మెంతుల్ని మీ ఆహారంలో చేర్చుకోండి. * అరుగుదల చక్కగా : మెంతుల్ని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బవెల్ మూమెంట్స్ బాగుంటాయి. మెంతులు అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలతోనూ పోరాడుతాయని పేరెన్నికగన్నవి.

ఆర్గెటిస్ పెయిన్ : మెంతుల్లో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన ఆర్డైటిస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి.

హృదయం పదిలం : మెంతుల్లో ఉండే గెలాక్టోమెనన్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది హార్ట్ రేట్ నీ, బ్లడ్ ప్రెజర్ నీ కంట్రోల్ చేస్తుంది.