కిడ్నీ ఆరోగ్యానికి : కిడ్నీలు చక్కగా పని చేయాడానికి మెంతులు సహకరిస్తాయి. వీటిలో ఉండే పాలీఫినాలిక్ ఫ్లేవనాయిడ్స్ కిడ్నీల పని తీరుని మెరుగుపరుస్తాయి. మెంతులు వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు, ఇవి స్కిన్ కీ, హెయిర్ కీ కూడా మేలు చేస్తాయి
అవేమిటంటే:
1. మెంతుల్లో ఉండే విటమిన్ సీ వల్ల కాంప్లెక్షన్ మెరుగు పడుతుంది. స్కిన్కి మంచి గ్లో వస్తుంది.
2. మెంతులు మంచి క్లెన్సర్గా కూడా పని చేస్తాయి. ఇవి ముఖం మీద నుండి మురికినీ, జిడునీ తొలగిసాయి.
3. మెంతుల్ని న్యాచురల్ స్కబ్ గా కూడా వాడుకోవచ్చు. ఈ స్కబ్ డెడ్ సెల్స్ నే కాదు, ఎక్కువగా ఉన్న ఆయిల్ ని కూడా తీసేస్తుంది.
4. మెంతులు చర్మానికి మంచి పోషణనిస్తాయి, మాయిశ్చరైజ్ చేస్తాయి.
5. మురికి, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల స్కిన్ మీద డార్క్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంది. మెంతుల్లో ఉండే విటమిస్ కే, విటమిన్ సీ వీటిని తొలగిస్తాయి. స్కిన్ మీద ఇంప్యూరిటీస్ ని తొలగించి చర్మానికి మంచి కాంతినిస్తాయి.
6. స్కిన్ అందంగా, యంగ్ గా, ఎలాంటి ముడతలు లేకుండా కనపడాలంటే మెంతుల డబ్బా అందుకోవడమే. మెంతులతో వేసే ఫేస్ మాస్క్ ముడతలకి కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ని నాశనం చేస్తుంది.
7. మెంతులు యాక్నే ప్రాబ్లంతో బాధ పడుతున్న వారికి కూడా హెల్ప్ చేస్తాయి.
8. మెంతులు చుండ్రుని తగ్గిస్తాయి, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తాయి.
9. మెంతులు జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. జుట్టుకి మంచి కళనిస్తాయి.
10. జుట్టు త్వరగా తెల్లబడిపోకుండా మెంతులు కాపాడుతాయి.