కాస్త ఏజ్ రాగానే.. మోకాళ్లనొప్పులు రావడం అందరికి జరుగుతుంది. జాయింట్ పెయిన్స్తో యూత్ కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనికోసం.. పెయిస్ కిల్లర్స్, జెల్స్ వాడుతుంటారు. నడి వయసునుంచే ఇలా టాబ్లెట్ వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. మరి అలాంటి వారికి.. నాచురల్గా ఉపశమనం కలిగించడానికి ఓ మంచి పద్ధతి ఉంది. అదే మస్టర్డ్ ప్యాక్. ఆవాలతో వేసే ఈ ప్యాక్ వల్ల నొప్పులన్నీ దెబ్బకి
మాయం అవుతాయట.

నొప్పులకు ఆవాల ప్యాక్ ఎలా చేయాలంటే.. ఆవాలను ఒకటిన్నర స్పూన్ తీసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి మరిగించాలి. ఎంతలా మరగాలంటే.. రెండు గ్లాసులు నీళ్లు కాస్త ఒక గ్లాస్ నీళ్లు అవ్వాలి. అప్పుడు ఒక కాటస్ క్లాత్ తీసుకుని.. మోకాలికి సరిపడా క్లాత్ కట్ చేసుకుని ఈ మరిగిన నీళ్లు మీరు ఎంత వేడి వరకూ భరించగలరో అంత వేడి ఉంచుకుని అందులో ఈ క్లాత్ ముంచి మోకాలి భాగంలో చుట్టేయండి. వేడి కాస్త తగ్గినప్పుడు మరిగిన నీళ్లు పైపైన చల్లండి.

నిమిషాల పాటు ఉంచుకోండి. షోల్డర్ జాయింట్ పెయిన్స్ కు, పిక్కల భాగంలో పెయిస్కు ఇలాంటి ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్నవారికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఆవాల్లో పెయిన్స్ తగ్గే మెడిసిన్స్ కు ఈ వేడి తగలడం వల్ల మజిల్స్ రిలాక్స్ అయి పెయిన్ తగ్గిస్తాయి. పెయిస్కు కారణమయ్యే రిసెప్టార్స్న కూల్ చేస్తాయి. ఇది పరిశోధన చేసి మరీ.. మంచి ఫలితం ఉందని నిరూపించారు. మనం నీళ్లు బాగా మరిగించాం కదా… చూసుకుని వేడి కంట్రోల్లోకి వచ్చాకే అప్లై చేసుకోవాలి

ఇంకా రిలీఫ్ కావాలంటే.. గానుగ ఆడించిన ఆవనూనె తీసుకుని అందులో కాస్త ముద్దకర్పూరం వేసుకుని పెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి.. అప్పుడు ఈ ప్యాక్ వేస్తే.. మంచి ఉపశమనం ఉంటుంది.. పెయిస్ కిల్లర్స్ వాడే బదులు కాస్త శ్రమ అయినా ఈ పద్ధతి ఫాలో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.