యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వంకాయలు తినొచ్చా..?
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వంకాయలు తినొచ్చా..? ఈ రోజుల్లో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు.. యూరిక్ యాసిడ్ గురించి పెద్దగా తెలియదు.. కానీ ఈ సమస్య కూడా లైట్ తీసుకునేంత చిన్నదేం కాదు.. దీర్ఘకాలిక రోగాల మాదిరిగానే యూరిక్ యాసిడ్ కూడా తీవ్రమైన వ్యాధి. ఈ సమస్య ఎలా వస్తుంది..? పరిష్కార మార్గాలు ఏంటో ఓ తూరి చూడండి మరీ..! యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినట్లు గమనించినట్లెతే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే.. కాలేయం పనిచేయడం మానేస్తుంది. గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. కొన్ని రకాల కూరగాయలు మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యారిక్ యాసిడ్ సమస్య ఉంటే వేటికి దూరంగా ఉండాలి..?
యూరిక్ యాసిడ్ ఉంటే పప్పులు, టమోటాలు తినకూడదనే అపోహ ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. అయితే చేపలు లేదా మాంసం మాత్రం అతిగా తినకూడదు. అలాగే రెడ్ మీట్, ఆల్కహాల్ పూర్తిగా తినడం మానివెయ్యాలి. బీన్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. అందుకే బీన్స్ తినడం పూర్తిగా మానివేయాలి. బఠానీ లేదా పప్పులో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఎండిన పప్పుల్లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. వంకాయల్లో కూడా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ పాయిని పెంచే లక్షణం కలిగి ఉంటుంది.