యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)కు కారణాలు ఏమిటి మరియు వాటికి చికిత్స ఎలా చేయాలి?
మూత్ర విసర్జక వ్యవస్థలో మూత్ర నాళం, మూత్రాశయం, మూత్ర పిండాలు వంటి భాగాలతో సహా ఏ భాగంలో అయినా కలిగే ఇన్ఫెక్షనే యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షను గా వ్యవహరించ బడుతుంది. UTI సంక్రమించకుండా నిరోధించు వివిధ రక్షణ వ్యవస్థలు సాధారణంగానే శరీరంలో ఉంటాయి. ఈ వ్యవస్థలు లేనపుడే UTI సంక్రమిస్తుంది. వ్యాధికారక క్రిములు అయిన బ్యాక్టీరియా వంటివి, లైంగిక సంపర్కం, సరిగా పాటించని శరీర పారిశుధ్య్యం మొదలగు అనేక కారణాల వలన మూత్ర విసర్జక వ్యవస్థలోనికి ప్రవేశిస్తాయి. అంతే కాకుండా, తగ్గిన రోగ నిరోధక శక్తి కూడా, కొందరు రోగులలో యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షనుగా రూపాంతరం చెందవచ్చును.
UTI లక్షణాలు: రోగి చలి జ్వరంతో బాధ పడవచ్చును, మూత్ర విసర్జన సమయంలో మంట/నొప్పితో బాధ పడవచ్చును.
చేయాల్సిన పరిశీలనలు:
అవసరం అయితే సంపూర్ణ మూత్ర పరీక్ష
KUB కొరకు మూత్ర విసర్జన తరువాత మిగిలిన మూత్ర పరిమాణంతో అల్ట్రాసౌండ్ స్కాన్.
యూరిన్ కల్చర్ మరియు సెన్సిటివిటి.
నిరోధక చర్యలు:
ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగడం.
తరచుగా మూత్ర విసర్జన చేయడం.
సంభోగం ముందు మరియు తరువాత మూత్ర విసర్జన చేయడం.
రీనల్ స్టోన్స్ ఉన్నవా అనేది నిర్ధారించుకోవడం
UTI సంక్రమణ అవకాశాలు ఉన్న రోగులకు ప్రొఫైలక్ట్రిక్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం
రక్తంలో చక్కెర నియంత్రణను సరిగా పాటించడం.