రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే
వేళ ప్రకారం నిద్రించడం మొదటి సూత్రం. నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఏ పరిస్థితుల్లోను ఆ వేళ తప్పవద్దు. సరైన నిద్రకు ఆహారనియమం కూడా ఎంతో అవసరం. నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ, ఘనపదార్ధాలను కానీ తీసుకోకూడదు. అందువల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది.
టీ, కాఫీలను ఎక్కువగా తాగరాదు. టీ, కాఫీలను బదులుగా బాదంమిల్క్ కర్ట్ పాలు మొదలైనవి తీసుకోవాలి. గోరువెచ్చని పాలు గ్లాసుడు నిదురించే ముందు రాత్రిపూట త్రాగితే మంచిది. పగటి సమయంలో ఎక్కువ నిద్రపోరాదు. అందువల్ల రాత్రి నిదుర రాదు.
నిద్ర రాదని మొరాయిస్తే మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ మీకు తెలియకుండా నిద్రలోకి జారిపోతారు. నిదురించే ముందు ఎలాంటి ఆలోచనలు చేయరాదు. పదేపదే పడకస్థానాన్ని మార్చవద్దు. కొత్త ప్రదేశం నిద్రకు ఇబ్బంది కలుగుచేస్తుంది. టాయిలెట్ అవసరాలను తీర్చుకోకుండా పడకను చేరరాదని గుర్తుంచుకోండి.