ఒక నారింజ పండులో 1.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచు తుంది. నారింజ పండ్లు రోజూ తీసుకుంటే మంచి నిద్రకూడా పడుతుంది.

నారింజలో 80 శాతం సి – విటమిన్ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
వ్యాయామాలు చేయడం పూర్తి అయిన తరువాత ఈ పండును లేదా జ్యూస్ తాగితే మంచిది. ఇది బరువును తగ్గిస్తుంది. విటమి న్-సి వల్ల చర్మం ఆరోగ్యకరంగా తయారవుతుంది.

నారింజల్లో ఉండే పొటాషియం మెదడుకు మంచిది. డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కండరాలకు మంచిది. బ్లడ్ ప్రెషర్‌ను నియం త్రించటంతో పాటు నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం నారింజకు ఉంది.

నారింజ పండ్లు తినటం వల్ల కంటి చూపు సైతం మెరుగుపడుతుంది.
ఒక పండు తింటే 35 క్యాలరీలు లభిస్తాయి.