వీటికి వీడ్కోలు పలకండి !
రోగనిరోధక శక్తి పెంచే ప్రయత్నాల్లో ఉంటే వాటితోపాటు వేటిని దూరంగా ఉంచాలో కూడా తెలుసుకోండి మరి!
చక్కెర.. చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ పదార్థాలు, మిఠాయిలు, డ్రింక్ లకు దూరంగా ఉండాలి. వీటితో కొవ్వు పెరగడమే కాదు.. గుండె జబ్బులకీ దారితీస్తాయి.
మైదా.. దాంతో చేసిన బ్రెడ్, బాగా పాలిష్ చేసిన బియ్యం. ఇన్ ప్లమేషన్కు దారితీస్తాయి. ఆ ప్రభావం రోగనిరోధక శక్తి పై పడుతుంది. బదులుగా పీచు, పిండి పదార్థాలను అందించే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
ఎక్కువ శుద్ధి చేసిన నూనెలూ ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియా
పైనా ప్రభావం చూపుతాయి. గానుగ నూనెలను వాడితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటునూ నియంత్రణలో ఉంచుతాయి.
కాఫీ.. కాఫీలో యాంటీ ఆక్సిండెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక మోతాదులో ఉంటాయి. పరిమితంగా తీసుకుంటే మంచిదే. అతిగా మారితే అజీర్తి, కడుపు ఉబ్బరంతోపాటు రోగనిరోధక శక్తి పైనా ప్రభావం చూపుతుంది. తక్కువ కెఫెన్ ఉన్నవాటిని ఎంచుకుంటే మేలు.
ప్రాసెస్ట్ మాంసమూ గుండెజబ్బు, రక్తపోటుతోపాటు కొన్నిసార్లు క్యాన్సర్ కి కారణమవుతుంది. అందువల్ల తాజాదానికే ప్రాధాన్యమివ్వండి.