సమ్మర్ రాబోతోంది… కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి!
వేసవి రాబోతోంది. ఇక కూల్ డ్రింక్స్ తాగడమనే అలవాటు పెరుగుతుంది. ఇటు పిల్లలూ, అటు పెద్దలూ హానికరమైన ఈ శీత లపానీయాలవైపు మొగ్గుతారు. వీటిల్లో చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. అందుకే పిల్లల్లో ఊబకాయానికి, ఫలితంగా భవిష్యత్తు లో డయాబెటిస్ రిస్క్ కి అవకాశాలు ఎక్కువ. అలాగే అందులోని ఫాస్ఫారిక్ యాసిడ్, దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతీస్తుంది. క్యాల్షియం మెటబాలిజమ్ ను దెబ్బతీస్తుందని, దాంతో ఎముకల ఆరోగ్యంపై , దుష్ప్రభావాలు పడతాయనే దాఖలాలూ ఉన్నాయి.
కృత్రిమ రంగులు కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతాయి. నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలైన సన్సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, పానక్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటివి పిల్లల్లో అతి ధోరణులకు కారణమవుతాయి. సోడియం బెంజోయేట్ విటమిన్ ‘సి’ తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారు తుంది. ఇన్ని అనర్ధాలు ఉన్నందున ముందు నుంచే కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం ఈ వేసవికే కాదు…. ఎప్పుడూ మేలు.