సూపర్… సెనగలు
సెనగలే కదా అని వాటిని తేలిగ్గా తీసుకోవద్దు..
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి మంచి ఆహారం సెనగలు. వయసుతో పాటు వచ్చే డిమెన్షియా, ఆల్జీమర్స్ ని కూడా ఈ సెనగలు నియంత్రిస్తాయి. కారణం.. శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ ని అదుపుచేసే శక్తి వీటికి ఉంది.
• కొందరికి ముఖంపై తెల్లని మచ్చలు వస్తుంటాయి. నానబెట్టిన సెనగలని త్రిఫల చూర్ణంతో కలిపి తీసుకుంటే ప్రయోజనం
ఉంటుంటుంది.
సెనగల్లో బి6, జింక్ పుష్కలంగా ఉండటం వల్ల.. జుట్టు రాలిపోయే సమస్య అదుపులో ఉంటుంది. అలాగే చిన్నవయసులోనే జుట్టు తెల్లగా మారడాన్ని నిరోధిస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే తామర వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. నానబెట్టిన సెనగలు మంచి ఔషధం. ఇనుము, క్యాల్షియం లోపం రాకుండా చూసి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.