స్లీప్ ఆప్పియా…..గురక..!
మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ అప్నియా కాకపోవచ్చు కానీ…. స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం… అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కో సారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది.
చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే.. దాని వల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అంద నప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండడు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు… రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్న వాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది.
గుండె జబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి.
మంచి జీవనశైలి అలవాట్లతో అప్పియాను. చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్న వారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.
ప్రశ్న: అసలు గురక ఎందుకు ఎలా వస్తుంది?
జవాబు: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా.. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే…. అవి వేలాడినట్టుగా
(ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి… అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడు,
అంగిలికి తాకినప్పుడూ… అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం.
గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదక రంగా పరిణమించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయాలి.
గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదక రంగా పరిణమించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయాలి.