నరాల గజిబిజి కదలిక వలన పాదంలో జలదరింపు, తిమ్మిరి నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కాలు తిమ్మిర్లు వస్తాయి. ముఖ్యంగా కండరాల్లో దృఢత్వం సమస్య వలన తిమ్మిర్లు, నొప్పి బాధాకరంగా మారుతుంది కాలు తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక వ్యాయామం , బరువు పెరగడం లేదా శరీరంలో నీరు లేకపోవడం, రక్త ప్రసరణలో సమస్యల కారణంగా కాళ్ళ తిమ్మిరి ఏర్పడవచ్చు.

మీరు తరచుగా కాలు తిమ్మిరిని ఎదుర్కొంటూ నొప్పి పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. ఉపశమనం కోసం ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. కొన్ని పరిస్థితిలో వైద్యుడిని చూడటం ఉత్తమం అయినప్పటికీ….. ఇంట్లోని వస్తువులతో సహజంగా కూడా కాళ్ళ తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పోషకాలు: కాళ్ల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువగా పోషకాలు లోపించి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక మూలకాల లోపం మీ సమస్యను మరింత పెంచుతుంది. వేడి పాలు: విటమిన్ డి, క్యాల్షియం లోపం వల్ల కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు
మొదలవుతాయి. పాలు కాల్షియం ఉత్తమ ఆహారం. ఎముకలను, కండరాలను బలంగా చేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పసుపు పాలు త్రాగండి. –
వేడి నీటితో స్నానం: వేడి నీటితో స్నానం చేసే అలవాటు మీకు అనేక ప్రయోజనాలను తెస్తుంది. వాటిలో ఒకటి కాళ్ళ తిమ్మిరి సమస్య నుండి ఉపశమనం. రోజూ పాదాలపై గోరువెచ్చని నీటిని పోసుకుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో రక్తప్రసరణను అడ్డుపడే సిరలు తెరుచుకోవడంతోపాటు కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఈ పద్ధతి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.