ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పదే పదే ఆహారాన్ని తీసుకోవడం, బయటి ఆహార పదార్థాలను తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు పెరగడం వలన శరీర ఆకృతి దెబ్బ తినడమే కాదు, అనేక వ్యాధులు వస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుండి

అందుకే బాడీలో కొవ్వులు కరిగించుకోవడం కోసం చాలామంది ఏవేవో చేస్తుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఉండలని ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఉండలను కనుక తిన్నారంటే శరీరంలో కొవ్వు అంతా కరిగిపోయి హెల్దిగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ఉండాలని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉండలని తయారు చేసుకోవడానికి ముందుగా స్టప్ ఆన్ చేసి పాస్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న అవిసె గింజలను పూర్తిగా చల్లారబెట్టుకొని, ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కని తీసుకొని పైన పొట్టంత తొలగించాలి.

తర్వాత నీటితో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఈ తురుము నుంచి జ్యూస్ ను వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అవిసె గింజల పొడి, అల్లం జ్యూస్, రెండు స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకొని అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ చేయకముందు తినాలి. ఈ ఉండలను ఫ్రిజ్లో కూడా నిలువ చేసుకోవచ్చు. రుచి ఎలా ఉన్న ఈ ఉండలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ కు ముందు రెండు ఉండలను తీసుకోవాలి. దీని ద్వారా ఇందులో ఉండే పోషక విలువలు బాడీలో కొవ్వుని మొత్తం కరిగించి బరువు తగ్గేందుకు సహాయపడతాయి